ఏపీ అసెంబ్లీ, శాసన మండలి ప్రోరోగ్‌

 అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ, శాసనమండలి ప్రోరోగ్‌ చేస్తూ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఉభయ సభలను ప్రోరోగ్‌ చేస్తూ గవర్నర్‌  బిశ్వ భూషణ్ హరిచందన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అసెంబ్లీని ప్రోరోగ్‌ చేయడంతో అధికార వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లుల స్థానంలో ఆర్డినెన్స్‌ తెచ్చుకునేందుకు ప్రభుత్వానికి వెసులుబాటు లభించినట్లు అయింది. కాగా బిల్లులు మండలి ముందున్న సమయంలో..సభలను ప్రోరోగ్‌ చేస్తే ఆర్డినెన్స్‌ జారీకి సాంకేతిక ఇబ్బందులు ఉండవని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. (ముఖం చెల్లక.. అసెంబ్లీకి రాలేక)


తాడేపల్లి: శాసన మండలి రద్దును ఎవరూ అడ్డుకోలేరని మంత్రి విశ్వరూప్‌ స్పష్టం చేశారు. టీడీపీ ఎమ్మెల్సీలు ఢిల్లీ వెళ్లినా మండలి రద్దు ఆగదన్నారు. మండలి రద్దు అనేది రాష్ట్ర పరిధిలోని అంశమని, ఈ విషయంలో రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తామని కేంద్ర బీజేపీ నేతలు చెప్పారన్నారు. టీడీపీ ఎమ్మెల్సీలు స్టేజ్‌ షో కోసం ఢిల్లీ వెళుతున్నారని విశ్వరూప్‌ ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు, టీడీపీ నేతలకు స్టేజ్‌ షోలు బాగా అలవాటు అని, సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులపై టీడీపీ నేతలు ఒత్తిడి తేవడం సరికాదన్నారు. (ప్రజా సంక్షేమంఅభివృద్ధికి ప్రతిపక్షమే అడ్డు)