మౌంట్‌మాంగనీ: టీమిండియాతో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లో వైట్‌వాష్ అయిన న్యూజిలాండ్.. మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి అందుకు ఘనమైన ప్రతీకారం తీర్చుకుంది. ఈరోజు జరిగిన చివరిదైన మూడో వన్డేలో న్యూజిలాండ్ ఐదు వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ 3-0తో కైవసం చేసుకుంది. చివరి వన్డేలో టీమిండియా నిర్దేశించిన 297 పరుగుల టార్గెట్‌ను కివీస్ 47.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కివీస్ ఆటగాళ్లలో మార్టిన్ గప్టిల్(66; 46 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు) నికోలస్(80;103 బంతుల్లో 9 ఫోర్లు) మంచి ఆరంభాన్ని ఇవ్వగా, గ్రాండ్ హోమ్(58 నాటౌట్; 28 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడి కివీస్‌కు ఘన విజయాన్ని అందించాడు.
టామ్ లాథమ్(32 నాటౌట్; 34 బంతుల్లో 3 ఫోర్లు) మరోసారి ఆకట్టుకుని తనవంతు పాత్రను పోషించాడు. దాంతో విరాట్ సేనకు ఘోర పరాభవం తప్పలేదు. కనీసం చివరి వన్డేలోనైనా గెలిచి పరువు దక్కించుకుందామనుకున్న టీమిండియా ఆశలు ఫలించలేదు. ఇలా టీమిండియా మూడు, అంతకంటే వన్డే సిరీస్‌ల్లో వైట్‌వాష్ కావడం ఓవరాల్‌గా నాల్గోసారి. 1983-84 సీజన్‌లో విండీస్‌తో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌లో వైట్‌వాష్ అయిన టీమిండియా.. 1988-89లో అదే జట్టుపై మరోసారి వైట్‌వాష్ అయ్యింది. ఆ తర్వాత మూడు అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో మొత్తం మ్యాచ్‌లు జరిగిన క్రమంలో టీమిండియా వైట్‌వాష్ కావడం ఇదే తొలిసారి. 2006-07 సీజన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌లో టీమిండియా 4-0తో సిరీస్‌ను కోల్పోయినా, ఒక వన్డే జరగలేదు. (ఇక్కడ చదవండి: సెంచరీతో రాహుల్ రికార్డుల మోత..!)